అజాద్ హిందు ఫౌజు గణపతి నేతాజి..
అఖండ భరత జాతి గన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతవని తన స్వప్నమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని
హిందుఫౌజ్ జైహింద్ అని కదిలాడు …
గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు..
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతవని తన స్వప్నమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని
హిందుఫౌజ్ జైహింద్ అని కదిలాడు …
గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు..
ప్రముఖ కవి జాలాది రాసిన ఈ పాటలో ఆఖరి వాక్యాన్నిప్పుడు మార్చుకోవాల్సిందే! ఎందుకంటే ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నారన్న వాదనకు ఊతమిస్తూ రోజుకో ఉదంతం వెలుగుచూడడమే ఇందుకు తార్కాణం. వీటి సంగతి ఎలా ఉన్నా? ఫైర్ బ్రాండ్ మమతక్క మాత్రం ఓ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన తమ వద్ద ఉన్న ఫైళ్లను బయటపెట్టాలని నిర్ణయించింది. బెంగాల్ రాష్ట్ర హోంశాఖ వద్ద నేతాజీకి సంబంధించి అతి ముఖ్యమైన ఫైళ్లు 64 వరకూ ఉన్నాయని, వాటిని త్వరలో అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడించిందామె! సెప్టెంబర్ 18న కోల్‌కతాలోని మ్యూజియంలో ప్రజల మధ్య నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్నామని ప్రకటించి, సంచలనానికి తెరలేపారు.
ఫలించిన.. పోరు : శెబ్బాష్ ! దీదీ
గత కొద్దికాలంగా నేతాజీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఆయన కుటుంబసభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.అనేకానేక పర్యాయాలు ప్రభుత్వాధీశులను కలిశారు కూడా.. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని నిర్ణయిం చడంతో సంబంధిత వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.వీటి సహాయంతో ఆయనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని, నాడు నేతాజీ మిస్సింగ్ సంబంధించి చరిత్రలో కలిసిపోయిన నిజాలను వెలుగులోకి తేవాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నాయి.కాగా.. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకూ.. నేతాజీ మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. విమాన ప్రమాదంలో మరణించారని కొందరు భావించారు. కానీ విమాన ప్రమాదంలో ఆయనకేమీ జరగలేదని.. ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారన్న ప్రచారమూ ఉంది.నేతాజీ ఫైళ్లకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నంలో భాగంగా మరికొన్ని నిజాలు వెల్లడి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.వాస్తవానికి నాడు గాంధీకి, నేతాజీకి సైద్ధాంతిక విభేదాలు ఉండేవి. అదే నేతాజీ మరణానికి దారి తీసిందా..? మన దేశానికి స‌్వాతంత్ర్యం తానే తెచ్చానన్న క్రెడిట్ ను కొట్టేసేందుకే గాంధీ.. నేతాజీ లాంటి యోధులపై పన్నాగం పన్నాడా.. ఇందులో జాతీయ కాంగ్రెస్ వ్యూహమేమైనా అమలైందా? రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా హిట్లర్ సేనలకు నేతాజీ సాయం అందించడం గాంధీకి నచ్చకే.. ఆయనతో అంటీఅంటనట్లు.. ముట్టీ ముట్టనట్లు ఉన్నాడా.. అన్నవి తేలాల్సి ఉంది.
మాట తప్పిన బీజేపీ
తాము అధికారంలోకి వస్తే 2014 ఎన్నికల్లో నేతాజీ ఫైళ్లను సార్వజనీనం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేతాజీ 117వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం కటక్‌లో జరిగిన బహిరంగ సభలో- స్వాతంత్ర్య సేనాని మరణ రహస్యం తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉందని బీజేపీ నేత రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ దీనిపై యూ- టర్న్ తీసుకుంది. 1937-47 కాలానికి చెందిన నేతాజీకి చెందిన 64 ఫైళ్లనూ డిజిటలైజేషన్ చేయాలని మమతా సర్కార్ సంకల్పించింది. నేతాజీ రహస్యాలను బహిర్గతం చేస్తామన్న మమత ప్రకటన కచ్ఛితంగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టనుంది.

please share it..
No comments:
Post a Comment