ట్వీట్టర్ ఖాతాదారులకు శుభవార్త… ట్వీట్టర్ లో ప్రత్యేక సందేశాలు పంపడానికి ప్రస్తుతం ఉన్న 140 అక్షరాల పరిమితిని ట్వీట్టర్తొలగించింది. ఇన్నాళ్ళు పరిమిత అక్షరాలతో సందేశాన్ని పంపడానికి ఇబ్బందిగా ఉండేది. పూర్తి సందేశాన్ని పంపడానికి ఈ 140 అక్షరాల పరిమితి ఆటంకంగా ఉండేది. దీంతో చెప్పాలనుకున్న విషయాన్ని పొట్టి పొట్టి అక్షరాలతో ముక్కు సూటిగా చెపాల్సి ఉండేది. దాంతో పెద్ద సమాచారాన్ని చెప్పడానికి సాధ్యపడేది కాదు. అందువల్ల ప్రత్యక్ష సందేశాలాలో అక్షరాల పరిమితిని తొలగించినట్లు ట్వీట్టర్ తెలిపింది. అక్షరాల పెంపుపై వినియోగదారులకు అవగాహనా ఏర్పడడానికి ఈ ఏడాది ఏప్రిల్ నుండే ట్రయల్ వర్షన్ అందుబాటులోకి తెచ్చిన వినియోగ దారులు దీనిని ఉపయోగించు కోలేకపోయరని ట్వీట్టర్ తెలిపింది.
పెంచిన అక్షరాల పరిమితి వచ్చే జులై నుండి అందుబాటు లోకి రానుందని ట్వీట్టర్ ప్రొడక్షన్ మేనేజర్ సచిన్ అగర్వాల్ తెలిపారు. గత ఏడాది కంటే ఎంతో మెరుగుగా ప్రత్యక్ష సందేశాలను పంపించేందుకు మార్పులు తీసుకు వచ్చామని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 140 అక్షరాల పరిమితిని పెంపు పై ఉన్న ప్రతిపాదనను ఖాతాదారులను అడగగా… అక్షరాల పరిమితి పెంచాల్సిన అవసరం లేదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నట్లు అయన తెలిపారు
please share it..
No comments:
Post a Comment