వయస్సు మీద పడుతోందని దిగులు చెందుతున్నారా ? మరింత యవ్వనంగా..కనిపించాలని ఆరాటపడుతున్నారా ?ఐతే..మీరు ఖచ్చితంగా ద్రాక్ష పళ్లను రోజూ తినాల్సిందే. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ వాస్తవం వెలుగు చూసింది. ద్రాక్షపళ్లను తీసుకోవడంతో యవ్వనంగా.. కనిపించడంతో పాటు స్కిన్ క్యాన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని పరిశోధనలో తేలింది.సూర్య కిరణాల నుంచి వెలువడే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్షపళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని డెయిలీ మెయిల్ ప్రచురించిన రీసెర్చ్ రిపోర్ట్ తేల్చింది. అల్ట్రా వయొలెట్ (యువి) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా.. చర్మం పాలిపోవడంతో పాటు వయస్సు మీద పడిన వారిలా.. స్కిన్ కల్చర్ మారిపోతుందని బార్సిలోనా యూనివర్సిటీ, స్పానిష్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ సైంటిస్టులు తెలిపారు. కానీ.. ద్రాక్షపళ్లను తీసుకోవడంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు.సో.. నిత్య యవ్వనులై వర్థిల్లాలంటే.. ద్రాక్షపళ్లు తినండి. చర్మసంబంధ వ్యాధులను దూరం చేసుకోండి.నవ మన్మథుడిలా వెలిగిపోండి. ఇదండీ గ్లామర్ కు సంబంధించిన గ్రామర్ సీక్రెట్. చదివారుగా.. ఆచరించండిక.
please share it..
No comments:
Post a Comment