ఇప్పటి వరకూ రాజమౌళి, బాహుబలి మూవీకి సంబందించిన రెండో పార్ట్ ని 2016లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ పై చిత్ర యూనిట్ నుండి సరికొత్త సమాచారం అందుతుంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాస్స్ కి నిరాశ మిగిలిందని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ భారీ విజయం సాధించడంతో, బాహుబలి పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి మూవీ షూటింగ్ సమయంలోనే బాహుబలి పార్ట్2కి సంబంధించిన 60శాతం షూటింగ్ ని రాజమౌళి పూర్తి చేశాడు. ఇక మిగిలింది 40 శాతం షూటింగే. అయితే ఈ నలభై శాతం షూటింగే బాహుబలి పార్ట్ 2లో కీలకం. అందుకే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. 2016 జనవరిలో బాహుబలిపార్ట్2 షూటింగ్ స్టార్ట్ అయి మే నెలలో షూటింగ్ ని పూర్తి చేసుకోనుంది. తరువాత దీన్ని విజువల్స్ ఎఫెక్ట్స్ కి పంపించనున్నారు. ఇందుకు గ్రాఫిక్స్ టీం దాదాపు ఆరు నెలల టైం తీసుకోనుంది. ఇలా మొత్తంగా బాహుబలిపార్ట్2 అవుట్ పుట్ బయటకు రావాలంటే దాదాపు 2016 సంవత్సరం పూర్తి కావాల్సిందే. దీంతో బాహుబలిపార్ట్2 మూవీ రిలీజ్ అంటే అది 2017లో సాధ్యపడుతుంది. ఇక ప్రభాస్ నటించే బాహుబలిపార్ట్ 2 కోసం 2016లో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్….తన హీరో నటించిన మూవీ 2017లోనే రిలీజ్ అని తెలుసుకొని షాక్ అవుతున్నారు. మొత్తంగా రాజమౌళి, ప్రభాస్ ఫ్యాన్స్ భలే షాకింగ్ ఇచ్చాడని అంటున్నారు.
please share it..
No comments:
Post a Comment