భల్లాలదేవ రానా కు కొత్త ప్రేయసి దొరికేసింది.బాహుబలి కొనసాగింపు భాగంలో ఆయన సరసన నటించేదెవ్వరో తెలిసిపోయింది.వాస్తవానికితొలిభాగంలో..భల్లాలదేవ కొడుకుగా బద్ర (అడవి శేష్) నటించాడు.ఐతే.. భల్లాలదేవ భార్యకు సంబంధించిన ప్రస్తావనను ‘బాహుబలి’లో తీసుకురాలేదు. దేవసేనను భల్లాలదేవ ప్రేమించాడని మాత్రమే చెప్పి వదిలేశాడు జక్కన్న.కథాగమనంలో భాగంగా.. భల్లాలదేవ ను పెళ్లి చేసుకున్న రాణి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం రూపు రేఖను సైతం చూపించలేదు. కానీ బాహుబలి – 2 లో భల్లాల దేవ భార్య పాత్రే కథకు కీలకమని, ఇందుకోసం లావణ్య త్రిపాఠిని తీసుకునేందుకు ఆలోచిస్తున్నారట రాజమౌళి.అందాల రాక్షసితో తెలుగింటికి పరిచయమైన ఈ మిస్ ఉత్తరాఖండ్ ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోన్న ‘సోగ్గాడే చిని నాయనా’ చిత్రంలో..నాగార్జున సరసన నటిస్తోంది.త్వరలోనే ‘బాహుబలి 2’లో నటించే అవకాశం లావణ్యకు దక్కితే ఇక అమ్మడి ఆనందానికి అంతే ఉండదు.ఏదైతేనేం.. ఓ సినీకవి అన్నట్లు అంతూ..పొంతూ లేని ఆనందం కావాలి అంటే ఇదేనేమో!
please share it..
No comments:
Post a Comment