దాసరి చేతిలో చిరు ఇరుక్కుపోయినట్టేనా?

08405020120

ఇండస్ట్రీలో దాసరి వర్గం, చిరు వర్గం అనే రెండు వర్గాలు ఉన్నాయనేది స్పష్టంగా వినిపిస్తుంది. దర్శకరత్న దాసరిపై చిరుంజీవి ఏనాడు బహిరంగంగా కామెంట్స్ చేయలేదు కానీ…తెర వెనుక నుండి మాత్రం చేయాల్సిందంతా చేయిస్తూనే ఉంటాడని అంటారు. కానీ చిరుని టార్గెట్ చేస్తూ దాసరి పలు సందర్భాల్లో ఓపెన్ గా కామెంట్స్ చేశారు. ఇక రామ్ చరణ్ అయితే దర్శకరత్నపై డైరెక్ట్ ఎటాకే చేశాడు. ఈ విషయం గతంలో పెద్ద చర్ఛనీయాంశంగానే మారింది. అయితే ప్రస్తుతం దాసరి చేతిలో చిరు ఇరుక్కున్నాడని అంటున్నారు. మెగాస్టార్ స్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వేధికగా ఇది జరుగుతుంది. తమిళంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చి హిట్ అయిన ‘కత్తి’ సినిమాని చిరు తన 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్నాడు. దీనికి సంబదించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అయితే రచయిత నరసింహారావు కత్తి సినిమా తనదేనని కథా హక్కుల వేదిక అయిన ‘తెలుగు కథా రచయిల సంఘం’లో కంప్లైంట్ చేసాడు. ఈ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడు దాసరి నారాయణరావు. ఇంకేముంది ఈ విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి కథ నరసింహారావుదేనని అతనికి చర్చల ద్వారా పరిష్కారం చూపి, తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పారు. నియమనిభంధనలు ప్రకారం దాసరి తీర్పుని చిత్ర యూనిట్ తు.చ తప్పకుండా పాటించాలి. కానీ ఇక్కడ చిరు 150వ సినిమా టీం…వారికి ఇవేం పట్టనట్టు వ్యవహరించిందట. దాంతో రచయితా నరసింహారావుకి న్యాయం జరిగేంత వరకూ 24 క్రాప్ట్స్ కి చెందిన వారు చిరు 150వ సినిమాకి పనిచేయకుడదని, అందుకు మిగతా సినీ కార్మిక సమాఖ్య నుండి మద్దతుని కోరుతుంది. ఇదే మద్దతు ప్రాసెస్ లోకి వస్తే చిరు 150వ సినిమాకి తెలుగు ఇండస్ట్రీ నుండి ఏ ఒక్క టెక్నిషన్ కూడ పనిచేయకుడదు. సమస్య పరిష్కారం తరువాతనే పని చేయాలి. ఈ విషయంలో అందరూ, దాసరి చేతికి చిరు భలే దొరికాడు అని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...