జూనియర్ సంతోషానికి రెండు కారణాలు?

0485045088

స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నడూ లేనంత హ్యాపీ మూడ్ లో ఉన్నాడని అంటున్నారు. ఇందుకు కారణం ఎవరు అని తెలుసుకుంటే రెండు ప్రత్యేక కారణాలుగా తెలుస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ క్లాస్ ఎంటర్టైనర్ యంగ్ టైగర్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ద్వారా తను కొత్తగా టాలీవుడ్ లో తనకు అందని ద్రాక్షలాగా అనిపిస్తున్న 50కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వటం. అలాగే తను సకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ తో ఈ విజయం అనేది సాధించటం.
ఇదిలా ఉంటే రెండోది వచ్చేసి ఈ మూవీ తరువాత తను నటించే సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఉండటం. ఇలా జూనియర్ వరుసగా ఇద్దరి స్టార్ డైరెక్టర్స్ తో పని చేయటం అనేది తనకు ఫుల్ హ్యాపీగా ఉందని అంటున్నారు. సుకుమార్ మూవీ ఎంతలా సక్సెస్ ని సాధించిందో…అంతకు మించిన సక్సెస్ ని కొరటాల శివ తనకి ఇస్తాడని జూనియర్ భావిస్తున్నాడంట.
ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేయనున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘జనత గ్యారేజ్’ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఫిబ్రవరి 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మొదటి షెడ్యూల్ ని సారధి స్టూడియోస్ లో చేయనున్నారు. ఇందులో మోహన్ లాల్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తరువాత ఓ మేజర్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ ముంబై కి వెళ్లనుంది. మొత్తంగా చాలా కాలం తరవాత జూనియ్ ఇంత హ్యాపీగా ఉండటం చూశామని ఫ్యాన్స్ సైతం చెప్పటం విశేషం అని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌