జుట్టును పెంచే ఆహారాలు ఉన్నాయా?

hair-growing-02323

పుష్టికరమైన ఆహారం అందమైన కేశాలకు వరంలాంటిది. నిజానికి ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మంచి ఆహారాలు అంటూ ఏమి లేవు. మనం తీసుకొనే ఆహారంలోనే సమతౌల్యత పాటిస్తే సరిపోతుంది. పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకుంటే ముఖంలో కాంతి,జుట్టులో మెరుపు తగ్గిపోతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే విటమిన్స్,ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. ఈ విటమిన్స్, ప్రోటీన్స్ ఏ ఆహారాల్లో లభ్యం అవుతాయో తెలుసుకుందాం.
ప్రోటీన్స్ : పాలు,పన్నీర్,మాంసం,చేపలు వంటి వాటిలో సమృద్దిగా లభిస్తాయి.
విటమిన్ ‘ఎ’ : వెన్న,గుడ్డు, పాలు,క్యారెట్,టమోటా,ఆకుపచ్చని కూరలు,కాయగురల్లో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘బి’ : పాలు,గుడ్లు,అక్రోట్స్, సోయా బీన్స్,చేపలు,మాంసం వంటి వాటిలో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘సి’ : అరటి,ఆకుపచ్చని కూరలు, నిమ్మ,నారింజ వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్ ‘డి’ : గుడ్లు,పాలు లాంటి వాటితో పాటు సూర్య కిరణాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...