హను రాఘవపూడి పెద్ద హీరోని పట్టేశాడు? !

2058953020

ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కవుగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు హను రాఘవపూడి. టాలీవుడ్లో ఎక్కడ విన్నా, ప్రస్తుతం ఈ హను రాఘవపూడి గురించే మాట్లాడుకుంటున్నారు. ‘అందాల రాక్షసి’ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నప్పటికీ… హను రాఘవపూడి కి పెద్దగా అ వకాశాలు రాలేదు. పెద్ద హీరోలకి తను వెళ్ళి కథలు చెప్పినప్పటికీ..మరో మూవీని తీయండి, చూద్ధాం..అంటూ చెప్పుకువచ్చారంట. ఈ లోపు మరో బలమైన కథని రాసుకొని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో ముందుకు వచ్చాడు. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుని మంచి సక్సెస్‌ ని అందుకుంది. ఇక నానికి సైతం ఈ మూవీతో మంచి పేరు వచ్చింది. హను రాఘవపూడి తన రెండో మూవీని సైతం బ్లాక్ బస్టర్ చేయటంతో ఇప్పుడు పెద్ద హీరోలు అంతా హను రాఘవపూడి వైపు చూస్తున్నారు. తన కథలకి మంచి రెస్సెట్ ఇస్తున్నారు.
ఇక ఈ ఊపులోనే హను రాఘవపూడి ఓ పెద్ద హీరోకి కథని చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడంట. త్వరలోనే ఈ వివరాలు తెలియనున్నాయి. ‘ఐతే’ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దగ్గర అసిస్టెంటుగా చేసిన హను రాఘవపూడి, తరువాత ఎయిడ్స్‌ మీద అవేర్‌నెస్‌ పెంచే ఉద్దేశంతో తీసిన క్రియేటివ్‌ షార్ట్‌ ఫిలిం కారణంగా, అనుకోని విధంగా రాజమౌళి చూడటం…తరువాత వీరిద్దరి మధ్య పరిచయం పెరగటం వంటివి జరిగాయి. అప్పటి నుండి హను రాఘవపూడి కి రాజమౌళి వద్ద నుండి మంచి సపోర్ట్ లభించింది. ఇప్పుడు హను రాఘవపూడి కి పెద్ద హీరోలతో అవకాశాలు రావటం వెనుక రాజమౌళి సపోర్ట్ ఉండటమే అని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌