లోకేష్ మ్యాజిక్‌: 30 వేల మంది కారు ఓన‌ర్లు

lokesh-7722

ఉద్యోగ శిక్షణలు, స్వయం ఉపాధితో యువతకు మేలు చేసే దిశగా దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పార్టీ యువ‌నేత నారా లోకేష్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, మరెన్నో చేయూత కార్యక్రమాలు చేపడుతుండగా తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వేల మందికి లబ్ధి చేకూర్చే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రవాణా రంగంలో అవకాశాలు విస్తృతమైన నేపథ్యంలో ఆ రంగంలో స్థిరమైన ఉపాధి అందుకునేందుకు 30 వేల మందికి చేయూత ఇచ్చేందుకు ట్రస్టు రెడీ అయింది.
ఇందుకోసం ఎన్టీఆర్ ట్ర‌స్టు ఉబెర్ ట్రాన్స్ పోర్టు కంపెనీతో ఒప్పందం కుదుర్చకుంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్‌, ఉబర్‌ సంస్థ డైరెక్టర్‌ డేవిడ్‌ ప్లఫ్‌ మధ్య ఈమేరకు ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు కారు డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారు. డ్రైవింగులో శిక్షణ తరువాత వారికి ఆర్థిక సహాయం చేసి, రుణం ఇప్పించి కారు కొనేలా చేస్తారు. వాటిని ఉబెర్ క్యాబ్ సర్వీసులతో అనుసంధానిస్తారు. దాంతో యువత కారు ఓనర్లుగా మారి సుస్థిరమైన ఉపాధిని పొందడమే కాకుండా కారును సొంతం చేసుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 30 వేలమందికి ఈ పథకంలో ఉపాధి లభిస్తుంది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మొదటివిడతలో 19 మంది డ్రైవర్లకు కార్లు అప్పగించారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...