వెయ్యికోట్లతో రంగలోకి దిగనున్నరాజమౌళి?

rajamouli-27822

బాహుబలి – 2 తరువాత జక్కన్న ఈగ సీక్వెల్ తెరకెక్కించే అవకాశముంద‌ని ఆ..మ‌ధ్య కుర్ర హీరో నాని ట్వీటేశాడు. ఈగ సీక్వెల్ తెరకెక్కిస్తే… అది కూడా బాహుబలి తరహాలోనే వందల కోట్లు వసూలు చేస్తుందన్న‌ ఐడియాతోనే జక్కన్న ఈగ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.ఇవన్నీ ఎలా ఉన్నా… లేటెస్ట్ గా బాహుబలి తరువాత రాజమౌళి ఓ వెయ్యి కోట్ల సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న న్యూస్
సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.
నాన్న‌దే క‌థ .. మిగతా ప‌రివార‌మే?
ఇండ‌స్ట్రీ ఊహాగానాలు ఎలా ఉన్నా.. జక్కన్న మనసులో గరుడ అనే ఓ వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్ట్ ఉందని, బాహుబలి – 2 తరువాత ఈ భారీ ప్రాజెక్ట్ ను ఆయన చేపట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో నటించేది ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా… ఈ మూవీ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించే పనిలో రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ నిమగ్నమయ్యారన్న‌ ప్రచారం మొదలైంది. ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్ వంటి పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను ఏకకాలంలో రిలీజ్ చేస్తే… వెయ్యి కోట్ల పెట్టుబడిని రాబట్టడం అంత కష్టమేమీ కాదని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జక్కన్న ప్రపోజల్ కు తగ్గట్టుగానే ఆ..రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమా తీసేందుకు పలు అంతర్జాతీయ సినీ సంస్థలు ముందుకు రావొచ్చన్న మాటలూ విన‌వ‌స్తున్నాయి.
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...