ఆలస్యం అయిందని చరణే చెప్పాడంట

080520120

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిబోతున్న చిత్రం తనిఒరువన్ తెలుగు రిమేక్. ఎన్నో నెలలుగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా, రామ్ చరణ్ మాత్రం త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవటంతో మూవీ సెట్స్ మీదకు వెళ్ళటానికి ఆలస్యం జరుగుతుంది. అయితే ఇంత కాలానికి రామ్ చరణ్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పై స్పందించాడు. చిత్ర యూనిట్ తో, ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళటానికి ఇప్పటికే ఆలస్యం అయింది. త్వరగా పనులు స్టార్ట్ చేయండి అంటూ చెప్పుకురావటం విశేషం. ఈ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తుంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్‌‌పై చరణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ టీమ్ ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకువస్తుంది. అలాగే మరోవైపు సాంగ్స్ కంపోజింగ్ కూడా మొదలైంది. ‘హిపాప్ తమిజా’ తనే స్క్రీన్ నేమ్‌తో ఆది, జీవా ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులని బెంగళూరులో మొదలుపెట్టేశారు. చరణ్ ఈ చిత్రాన్ని మార్చిలోపు పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందుకే భారీ షెడ్యూల్స్ ని పెట్టాల్సిందిగా దర్శకుడిపై చరణ్ ఒత్తిడి చేస్తున్నాడంట.

Comments

Popular posts from this blog

Underground DLC: Procedurally generated levels come to The Division

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Former US Secret Service agent may have stolen bitcoins