క‌త్రీనా వల్ల‌ ర‌ణ‌బీర్‌కు అంత వ‌దిలిందా?

801850560

మొన్నిటి వ‌ర‌కూ వాళ్లిద్ద‌రూ బాలీవుడ్‌లో ప్రేమ‌ప‌క్షులు.. ఒకే గూటిలో ఉన్నాయి.. కానీ వాటి మ‌ధ్య‌లో కొన్ని విభేదాలు వ‌చ్చాయి.. విడిపోదామ‌నుకుని నిర్ణ‌యించుకున్నాయి.. ఒకేమాట మీదికొచ్చాయి.. ఆ గూటిని విడిచిపెట్టి ఒక ప‌క్షి వెళ్లిపోయింది.. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంత సింపుల్‌గా విడిపోతే ట్విస్ట్ ఏముంటుంది చెప్పండి. ఆ ప్రేమపక్షులు విడిపోతే ప్రేమికుడికి ఇరవై ఒక్క కోట్ల చిల్లు పడిందట. ఏంటిదంతా.. ఎవ‌రీ ప‌క్షులు? అన్నికోట్లు ఎందుకు న‌ష్టం వ‌చ్చింది? అనుకుంటున్నారా? ఇదంతా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రీనా కైఫ్‌, న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ గురించి.
బాలీవుడ్‌లో ప్రేమికులుగా పేరొందిన రణబీర్ కపూర్,కత్రీనా కైఫ్‌లు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వారిద్దరు కలిసి ఒక అపార్ట్‌మెంటులోనే ఉంటారు. దానికి అద్దె ఎంతో తెలుసా… నెల‌కు రూ.15ల‌క్ష‌లు. దానికి సెక్యూరిటీ డిపాజిట్ ఎంతో తెలుసా… అక్ష‌రాలా రూ.21 కోట్లు. ఇదంతా రణబీర్ కపూర్ ఇచ్చాడ‌ట. ఇప్పుడు వాళ్లిద్ద‌రూ కలిసి జీవించడం సాధ్యం కాదని బావించారట. దాంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతా సాఫీగా జ‌రిగిపోతే ఏముందో ఏమో! సినిమా తరహాలో ట్విస్టు వచ్చింది.
రణబీర్ కపూర్ ఇప్పుడు ఆ ఖరీదైన అపార్టుమెంటుకు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ ను కత్రీనా కైఫ్ కు వదలి వెళ్లిపోవల్సి వచ్చిందట. వీరిద్దరూ విడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతుంటే, ఈ 21 కోట్ల వ్యవహారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందట. మ‌రి ప్రేమ‌లో ఉన్నా మ‌గాళ్ల‌కే ఖ‌ర్చు.. విడిపోయాకా వాళ్ల‌కే ఖ‌ర్చు అంటారు! ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటే ఇదేనేమో!

Comments

Popular posts from this blog

Underground DLC: Procedurally generated levels come to The Division

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away