వైఫై ప్లేస్ లో లైఫై

wifi-lifi-222
వైఫై.. సాంకేతిక రంగంలో స‌రికొత్త విప్ల‌వం. వైర్‌లెస్ మొబైల్ స‌ర్వీసెస్‌లో ఓ రివ‌ల్యూష‌న్‌. ఇప్పుడు దీనిని మించిన మ‌రో సాంకేతిక విప్ల‌వం రానుం దంటున్నారు నిపుణులు. ప్ర‌స్తుతం పరీక్ష‌ల ద‌శ‌లో ఉన్న ఈ టెక్నాల‌జీ పేరు లైఫై. స్కాట్ ల్యాండ్ కేంద్రంగా న‌డుస్తోన్న ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో ఈ విధానాన్ని కనుగొన్నారు. ఇప్ప‌టికే ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను పరిశోధకులు నిర్వ‌హించారు. ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతాల‌లో సులభత‌ర ప్రసారాల కోసం ఓ స్మార్ట్ లైట్ సొల్యూషన్ ను డిజైన్ చేస్తున్నారు.
రేప‌టి త‌రం టెక్ మంత్ర
ఈ త‌ర‌హా సురక్షిత వైర్ లెస్ యాక్సిస్ కోసం హాస్ టీమ్ ఓ ప్లే ప్లగ్ ను, అప్లికేషన్ ను రూపొందించారు. ‘ఒలెడ్ కాం’ అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడ కంతో పాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆస్ప‌త్రుల్లో కూడా ఇన్ స్టాల్ చేసింది. విజిబుల్ లైట్ కమ్యూనికేష‌న్‌తో ప‌నిచేసే లైఫై.. వైఫై కంటే వంద రెట్లు ఫాస్ట్‌గా ఉంటుంద‌ట‌! లైట్‌ని ఉప‌యోగించి ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ని డేటాగా ప్ర‌సారం చేసేందుకు దీన్ని ముందుగా కొన్ని చోట్ల ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించారు. ఈ కొత్త వైర్ లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్ తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్ లో సందేశాల ను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్ లైట్ గోడల నుంచి ప్రసారం కాదు. పైగా ఇది సురక్షితం. ఎటుపడితే అటు ప్రసరిస్తుంది. ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు వైఫై స్థానాన్ని భర్తీ చేయకపోయినా.. కొద్ది రోజుల్లో దీనికి దీటుగా పనిచేసే అవకాశం ఉందన్న‌ది శాస్త్ర‌వేత్త‌ల ధీమా!
please share it..

Comments

Popular posts from this blog

Underground DLC: Procedurally generated levels come to The Division

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Former US Secret Service agent may have stolen bitcoins