రహస్య కెమెరాతో బయటపడ్డ కోడలి దాష్టీకం
బిజ్నూర్: ఆమె విద్యాధికురాలు. నాగరికురాలిగా కనిపిస్తుంది కూడా. కానీ కాళ్లు చచ్చుపడిపోయిన అత్త పట్ల మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కనీసం మనిషని.. ముసలావిడనే కనికరం కూడా లేకుండా జుట్టుపట్టి ఈడ్చి, తలపై బండరాయితో మోది హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ దాష్టీకంలో నిందితురాలైన కోడలిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.  వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ కు చెందిన సంగీతా జైన్ అనే వివాహితకు కొన్నేళ్లుగా భర్తతో విబేధాలున్నాయి. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. వేధింపులు, లైంగికదాడి సహా భర్త సందీప్ జైన్ పై పలు అక్రమ కేసులు బనాయించిన సంగీత.. బెదిరించిమరీ అత్తింట్లోనే ఉంటోంది. భర్తను జైలుకు పంపి, అత్త రాజ్ రానీ జైన్ ను హతమార్చితే ఆస్తి సొంతమవుతుందనుకున్న సంగీత.. ఆమేరకు పథకం రచించుకుంది.
ఇంట్లో ఎవరూలేనప్పుడు అత్తను తీవ్రంగా హింసించేది. చున్నీ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసేంది. బండరాయితో తలపై బాదేది. అయితే భార్య ప్రవర్తనపై ఎప్పటినుంచో అనుమానమున్న సందీప్.. ఇంట్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటుచేశాడు. ఆ సంగతి తెలియని సంగీత ఎప్పటిలాగే అత్తపై క్రౌర్యాన్ని ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయింది. జనవరి 5 నాటి దృశ్యాలను సాక్షాధారాలుగా భార్యపై పోలీసులకు ఫిర్యాదుచేశాడు సందీప్ జైన్. రంగంలోకి దిగిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకుని, బాధిత అత్తను ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌