175 రోజుల శ్రీమంతుడు

480450120

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై తెర‌కెక్కిన శ్రీమంతుడు సినిమా ఈ రోజుతో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌ల కాలంలో సినిమాలు థియేట‌ర్ల‌లో రెండు వారాల‌కు మించి ఆడ‌డం గ‌గ‌న‌మైపోతున్న త‌రుణంలో శ్రీమంతుడు ఏకంగా సిల్వ‌ర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సీవీఎం) నిర్మించారు.
మ‌హేష్ కేరీర్‌లోనే ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల పై చిలుకు షేర్ సాధించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న శ్రీమంతుడు ఎమ్మిగనూరు – లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు పూర్తి చేసుకుంది. గ‌తంలో ఇదే సెంట‌ర్‌లో బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమా కూడా ఏకంగా 4 ఆట‌ల‌తో 500 రోజులు పూర్తి చేసుకుని స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు ఇటీవ‌ల 6 ‘ఐఫా’ అవార్డులు గెలుచుకుంది.

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

27 Confidence Hacks Psychology of Attraction