చేతి గోళ్లు మనకు రాబోయే వ్యాధులు చెప్తాయి తెలుసా?

చేతి గోళ్లు మనకు రాబోయే వ్యాధులు చెప్తాయి తెలుసా?

Nails-health-indecatoors-01
గోళ్లు.. మ‌నకొచ్చే జ‌బ్బులేంటో చెబుతాయ్‌. అందుకు కార‌ణాలు కూడా కొన్ని కొన్ని సార్లు తెలుసుకొమ్మంటాయ్‌. అమ్మాయిలూ..! పెడిక్యూర్‌.. మొనొక్యూర్ మాట‌మో గానీ ముందు మీ ఆరోగ్యం సంగ‌తేంటో తెలుసుకోండి. కొంత మందికి గోళ్లు పెరిగి వాటంతట అవే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారికి కాల్షియం, విటమిన్ డి లేదా జింక్ లోపం ఉందని తెలుసుకోవచ్చట. అటువంటి వారు కొవ్వు తక్కువ శాతం ఉన్న పాలపదార్థాలు, చేపలు వంటి వాటిని తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్ సమకూర్చుకోవచ్చన్న‌ది వైద్య నిపుణుల సూచ‌న‌.కొంతమందికైతే గోళ్లు అస్స‌లు పెరగనే పెరగవు. కొన్ని సార్లు పెరిగినా పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటి వారికి రక్తహీనత, పోషకాహార లోపం ఉందని గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారినపడే ప్రమాదముంది. ఇంకొందరి గోళ్లు మందంగా పసుపు రంగులో, నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఈ త‌ర‌హా వ్య‌క్తులు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వీరు విధిగా ధైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావించాలి. అటువంట‌ప్పుడు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంంది. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా ఆ..వ్యక్తికి లివర్ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. లేదంటే హెపటైటిస్ వ్యాధి బారినపడ‌తార‌ని వైద్యులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...