మోదీపై ఒత్తిడికి చంద్రబాబు సరికొత్త ప్లాన్

010021010

బీహార్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న బీజేపీ ఓటమి ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఎంతగానో నిరాశ కలిగించినా... కొందరికీ మాత్రం ఇది అందివచ్చిన అవకాశంగా మారింది. ముఖ్యంగా తమ మిత్రపక్షాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకు సాగుతున్న బీజేపీపై మహారాష్ట్రలోని శివసేన అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఓటమికి సోనియా బాధ్యత తీసుకున్నట్టే… బీహార్ లో బీజేపీ ఓటమికి మోదీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసింది. శివసేన సంగతి అలా ఉంటే… బీహార్ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ బీజేపీని లొంగదీసుకుని ఏపీకి ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులు సాధించడానికి చంద్రబాబు సరికొత్త వ్యూహాలు అమలు చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీలో మోదీ జోరుకు కళ్లెం పడే అవకాశం ఉండటంతో.. అద్వానీ, వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ వంటి ఇతర సీనియర్ నేతల సహకారం తీసుకుని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం. మిత్రపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకు అందించే సాయాన్ని ఈ నేతల ద్వారా మోదీకి గుర్తు చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని… ఈ వ్యూహాం సక్సెసయితే ఏపీకి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి సరికొత్త ఆలోచన ఫలిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...