అఖిల్ విషయంలో చేతులెత్తేసిన నితిన్

04120120s12010d

ప్రస్తుతం అక్కినేని మూడోతరం నటుడు అఖిల్, తన డెబ్యూ మూవీ అఖిల్ తో అధరగొట్టడానికి రెడీ ఉన్నాడు. నవంబర్ 11న దీపావళి కానుకగా భారీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని లెక్కల ప్రకారం ఈ మూవీకి అనుకున్నంత బిజినెస్ జరగలేదని అంటున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయలకు పైగానే అఖిల్ మూవీ కోసం నిర్మాత అయిన నితిన్ ఖర్చు పెట్టాడు. పెద్ద హీరోల బడ్జెట్ 40 కోట్ల రూపాయలు టచ్ అయిందంటే, నిర్మాతల వెన్నులో భయం పుట్టుకొస్తుంది. అలాంటిది డెబ్యూ హీరో మూవీకి నిర్మాత 40 కోట్ల రూపాయలను అవలీలగా ఖర్చు పెట్టాడు. అంతే కాకుండా ఇప్పటికీ ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చెపెడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకూ అఖిల్ మూవీకి సంబంధించిన బిజినెస్ 70 పర్సెంట్ జరిగింది. మిగిలిన్ 30 శాతాన్ని నితిన్ భరిస్తూ..మూవీనీ రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకుందంటే, ఇక నితిన్ కి 5 నుండి 10 కోట్ల రూపాయల వరకూ లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అంతే స్థాయిలో నష్టాల్ని చూసే అవకాశం ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి అఖిల్ మూవీకి నిర్మాత పరంగా నితిన్ ఏం చేయాలో అన్ని చేసి, ఇక రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 11న రిజల్ట్ రానుండటంతో, అప్పటి వరకూ చెతులెత్తేసి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...