ఎన్టీఆర్ సినిమాకు కొత్త టైటిల్ వచ్చింది…

jr-ntr-new-movie-title-01212

అభ‌య్ రామ్ (తార‌క్ కొడుకు పేరు) అభిరామ్ (తార‌క్ సినిమా పేరు) ఇద్ద‌రూ రాముళ్లే! ఇద్ద‌రూ ఆబాలగోపాలాన్నీ అల‌రించే చంద్రుళ్లే! ఒక‌రు న‌ట‌నాభిరాముడే కాదు నాట్యాభిరాముడు కూడా..! మ‌రొక‌డు తారక ఇంట న‌డ‌యాడుతున్న బుడ్డోడు.ఎందుకిదంతా అంటే! తారక్ – సుక్కూ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాకు అభిరామ్ అన్న టైటిల్ నిర్ణ‌యించారు. తొలుత అనుకున్న నాన్న‌కు ప్రేమ‌తో అన్న టైటిల్ ను వ‌ద్ద‌నుకుంది యూనిట్‌. టైటిల్ మ‌రీ! పొయెటిక్‌గా ఉండడం..మాస్ ట‌చ్ లేక పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.
మ‌ధ్య‌లో దండ‌యాత్ర అనే టైటిల్ కూడా అనుకున్నా ఆఖ‌రికి సుక్కూ అండ్ తారక్ అభిరామ్‌కే ఓటేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌.చ‌త్ర‌ప‌తి ప్రసాద్ నిర్మాత.నాన్న సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా త‌న గెట‌ప్‌ను కూడా డిజైన్ చేయించాడు.అభిమానుల‌నే కాదు బ‌య్య‌ర్ల‌నూ ఇదెంతో క‌ట్టిప‌డేసింది.సో..తార‌క్స్ లుక్సూ.. సుక్కూ ట్రిక్పూ స‌మ‌పాళ్ల‌లో క‌లుసున్నాయ్ గ‌నుక ఈ సినిమాకు స‌క్సెస్ గ్యారంటీ! ఎనీ డౌట్స్‌!

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌