ఆ లాయ‌ర్ షీ టీంకు ఎందుకు చిక్కాడు

0480450120

ప‌విత్ర‌మైన న్యాయ‌వాద వృత్తిలో ఉన్న ఆ లాయ‌ర్ చెడ్డ‌ప‌ని చేసి షీ టీం చేతికి చిక్కాడు. హైదరాబాద్ బర్కత్‌పురా ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల అభిషేక్, రీసెంట్‌గా గచ్చిబౌలిలో జరిగిన ఐఐఎఫ్‌ఏ ఉత్సవానికి హాజరయ్యాడు. ఇదే ఉత్సవానికి ఢిల్లీ నుంచి వచ్చిన మహిళతో రిలేషన్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేశాడు అభిషేక్.తాను మీడియా ప్రతినిధి అని, తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటూ రిక్వెస్ట్ చేశాడట.
అయితే ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఆమె అత‌డి రిక్వెస్ట్‌ను తిర‌స్క‌రించింది. దీంతో ఆమెపై క‌క్ష పెట్టుకున్న అత‌డు అప్పటినుంచి ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. వీటిని మానుకోవాలని ఆమె హితవును పెడచెవిన పెట్టి అభిషేక్ రోజరోజుకూ వేధింపులు తీవ్రం చేయడంతో ‘షీ’ టీమ్‌ను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌