హీరోయిన్ విషయంలో వేలు పెట్టనివ్వలేదు?

raviteja-577

ఫాంలో ఉన్న స్టార్ హీరోలకి వారి మూవీలోని స్టార్ సెలక్షన్స్ అన్నీ…హీరో సూచనల మేరకు మాత్రమే జరుగుతాయి. కాదని ఒక్క ఆర్టిస్ట్ ని కూడ డైరెక్టర్ సెలక్ట్ చేయటానికి సాహసించడు. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ సినిమా విషయంలోనూ హీరోయిన్ సెలక్షన్స్ లో తనదే ఫైనల్ డిసిషన్ గా ఫిక్స్ అయ్యాడు. రవితేజ, చక్రి దర్శకుడిని పరిచయం చేస్తూ ‘రాబిన్ హుడ్’ సినిమాని సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. ఇక డైరెక్టర్ చక్రి నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడు. అయితే హీరోయిన్ విషయంలో చక్రి, ఓ కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని రవితేజకి చెప్పాడంట. కానీ రవితేజ మాత్రం తనకు కంఫర్ట్ గా ఉండే హీరోయిన్ ని సెలక్ట్ చేసుకున్నారని తెలిసింది. ఇందులో రాశిఖన్నా కి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ఈ విషయంలో డైరెక్టర్ చక్రి ని సైలెంట్ కావాలని చెప్పాడంట. దీంతో హీరోయిన్ విషయంలో ఏ మాత్రం తను వేలు పెట్టకుడదని డైరెక్టర్ చక్రికి అర్ధం అయింది. ఇదిలా ఉంటే గతంలో ఈ సినిమాలో రవితేజకి జోడీగా అమీ జాక్సన్ ని హీరోయిన్ గా ట్రై చేసారు. కానీ తన డేట్స్ ఏ మాత్రం అడ్జెస్ట్ కాకపోవటంతో రవితేజ ఫైనల్ గా రాశీ ఖన్నాకి ఛాన్స్ ఇప్పించాడు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌