చరణ్ దెబ్బకి సురేందర్ రెడ్డి షాక్

48020120

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దెబ్బకి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి షాక్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన ‘బ్రూస్ లీ’ సినిమా చరణ్ ని సంతోషపెట్టలేదంట. దీంతో కథపై చాలా విరామం తీసుకొని, ఓ రిమేక్ కథపై కసరత్తులు చేయించి ఫైనల్స్ గా సెట్స్ మీదకు తీసుకువస్తున్నాడు. తమిళ్ లో హిట్ అయిన తనిఒరువన్ రిమేక్ సినిమా కి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రెడీ అవుతున్నాడనే సంగతి తెలిసిందే. తమిళంలో హిట్ ఈ ‘తని ఒరువన్’ తెలుగులోనూ భారీ విజయం సాధిస్తుందని రామ్ చరణ్ గట్టి థీమాగా ఉన్నాడు. ఈ సినిమాకి ‘రక్షక్’ అనే టైటిల్ ఫైనలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీ తమిళ వెర్షన్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తెలుగులోనూ విలన్ గా తీసుకోవటం ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై చిత్ర యూనిట్ దాదాపు 4 నెలల నుండి కసరత్తులు చేస్తున్నారు. ఎప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందా అని చిత్ర యూనిట్ సైతం ఎదురుచూపులు చూడసాగింది. అయితే రామ్ చరణ్ ఇప్పటి వరకూ రెస్ట్ లో ఉండి ఇక నుండి ఈ మూవీని ఉరుకులు పెట్టించాలని చూస్తున్నాడు. దాంతో ఫిబ్రవరి 21 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చాడు. చరణ్ కి హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందించనున్నాడు. అయితే చరణ్ ఈ మూవీని కేవలం 70 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పుకొచ్చాడు. ఇక సురేందర్ రెడ్డి మాత్రం 100 రోజుల షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. ఇప్పడు వీటిని చరణ్ ఆదేశాల మేరకు 70 రోజుల షెడ్యూల్స్ కి కుదించాలి. చరణ్ నిర్ణయంతో సురేందర్ రెడ్డి షాక్ అయ్యాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌