తొందర పడ్డ మహేష్ బాబు

mahesh-345

మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన సినిమాల్లో హీరో పాత్రలే కాకుండా, తన మూవీకి సంబంధించిన నిర్మాణ బాధ్యతలను కూడ తీసుకుంటున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ నుండి మహేష్ బాబు మంచి ఫాంలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ మూవీ కాంబినేషన్ నుండి వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. శ్రీమంతుడు మూవీకి మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందుకు మహేస్ బాబు దాదాపు 50 కోట్ల రూపాయల షేర్ ని తీసుకున్నాడని అన్నారు. ఆ విధంగానే ఇప్పుడు బ్రహ్మోత్సవం మూవీలోనూ తను పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఫాంలో ఉన్నస్టార్ హీరోల సినిమాలు చిత్రీకరణ దశలోనే బిజినెస్ పూర్తవుతుంది. ఆ విధంగా బ్రహ్మోత్సవం సినిమా ఓవర్సీస్ రైట్స్ కి దాదాపు 13 కోట్ల రూపాయల డిమాండ్ పలికింది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ కూడ భారీ రేటు పలికింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు ఫైనలైజ్ చేశారు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక ప్రైజ్ కి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినప్పటికీ…మహేష్ ఈ విషయంలో తొందరపడ్డాడని అంటున్నారు. ఏ మూవీకైనా ఆడియో రిలీజ్ తరువాత శాటిలైట్ రైట్స్ ని అమ్ముకుంటే మంచి డిమాండ్ ఉంటుంది. కానీ మహేష్ మాత్రం ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉండగానే శాటిలైట్ రైట్స్ ని అమ్ముకున్నాడని అంటున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features

Top 5 Free Screen Recording Softwares For Windows

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away