ఆ సినిమా దెబ్బ‌కు ఇళ్లు అమ్ముకున్న వినాయ‌క్‌

4085045054740

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ వినాయ‌క్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసింది. అదే అఖిల్. అక్కినేని వార‌సున్ని గ్రాండ్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం చేసే బాధ్య‌తను తీసుకున్న వినాయ‌క్.. అఖిల్ ను అట్ట‌ర్ ఫ్లాప్ తో ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసిన ప‌ర‌మ చెత్త రికార్డును ద‌క్కించుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వినాయ‌క్ క్రేజ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ప‌ర‌మ బోరింగ్ సినిమాతో అఖిల్ ను ఇంట్ర‌డ్యూస్ చేసిన తీరు వినాయ‌క్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షాన్ని కురిపించింది.
అఖిల్ సినిమా త‌ర్వాత వినాయ‌క్ డైరెక్ష‌న్ మీద చాలా మందికి అనుమానాలు కూడా క‌లిగాయి. ఈ సినిమాకు ముందు ఓ సొంత ఇంటిని కొనుగోలు చేశాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న టేస్ట్ కు త‌గ్గ‌ట్లు ఆల్ట్రా లావిష్ గా కోట్లు ఖ‌ర్చు చేసి సొంత ఇంటిని క‌ట్టించుకున్నాడు వినాయ‌క్. ఎంతో ఇష్టంగా క‌ట్టించుకున్న ఈ ఇంటి త‌ర్వాతే అఖిల్ సినిమా చేశాడు వినాయ‌క్. ఇది ఫ్లాపైంది. ఏమైందో ఏమో తెలియ‌దు గానీ వినాయ‌క్ త‌న ఇంటిని రూ.20 కోట్ల‌కు అమ్మేశాడ‌న్న టాక్ ఇండ‌స్ర్టీలో వినిపిస్తోంది.
సొంత ఇంటిని అమ్మేసిన వినాయ‌క్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల్లేని ఓ ప్ర‌ముఖ సీనియ‌ర్ హాస్య‌న‌టుడి ఇంట్లో రెంట్ కి ఉంటున్నాడ‌ని స‌మాచారం. గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఆ హాస్య‌న‌టుడు చాలా సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో అయితే హీరోతో స‌మాన‌మైన పాత్ర‌లిచ్చారు వినాయ‌క్. మొత్తానికి అఖిల్ త‌ర్వాత వినాయ‌క్ ప్రొఫెష‌న‌ల్ గానే కాదు.. ప‌ర్స‌న‌ల్ గానూ న‌ష్ట‌పోయాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ర్టీలో వినిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌