నేను ఎమైనా తీవ్రవాదినా – దాసరి

75205205207

కాపుల కోసం దీక్ష చేస్తున్న త‌న మిత్రుడ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని క‌లిసేందుకు వెళుతుంటే త‌న‌ను పోలీసులు అడ‌గ‌డుగునా అడ్డుకున్నార‌ని…తాను ఈ దేశ‌పౌరుడినా లేదా తీవ్ర‌వాదినా అని ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు విమ‌ర్శించారు.
ముద్రగడ పద్మనాభం దంపతులను పరామర్శించేందుకు అష్టకష్టాలు పడి రాజమండ్రి వరకు చేరుకున్న ఆయనను.. బయటకు కదలనీయకుండా హోటల్ బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సంద‌ర్భంగా దాస‌రి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోందని ఆయ‌న‌ అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ పాలనలో ఉన్నామా అని దాస‌రి ప్రశ్నించారు. మార్గమధ్యంలో కూడా పలుమార్లు నందిగామ, ఇతర ప్రాంతాల్లో అడ్డుకోవడంతో ఖమ్మం, సత్తుపల్లి మీదుగా అటవీ మార్గంలో దాదాపు 12 గంట‌లు ప్ర‌యాణించి తాను రాజమండ్రి చేరుకున్నానని, ఇక్కడేం చేస్తారో చూడాల్సి ఉందని అంతకుముందే దాసరి నారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు.
తెలుగు జాతికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. క్రిమినల్స్ ను వెంటాడినట్టుగా తమను వెంటాడం సరికాదని భావ్యం కాదన్నారు. కిర్లంపూడి వెళ్లి ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు చెప్పారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటిసారి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని ఆపడం ఏపీలో చూస్తున్నామన్నారు. ఇదేం పద్ధతి అని ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. చట్టం వారికే కాదని, మాకూ ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చేది సమస్యలు పరిష్కరించడానికేనని చెప్పారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌