ఈ యాంకర్ అందుకు ఒప్పుకుంటుందా?

reshmi-4567

ఈ మధ్య కాలంలో ప్రముఖ యాంకర్స్ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా కుర్రకారుని వారి గ్లామర్ తో కట్టిపేడేస్తున్న బుల్లితెర యాంకర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలని తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా యాంకర్ రష్మీ, అనసూయ వంటి యాంకర్స్, వారి గ్లామర్ తో సినీ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇక తాజాగా జాతీయ అవార్డు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘గుంటూర్ టాకీస్’ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇందులో సిద్ధు, శ్రద్ధా దాస్, రష్మి వంటి వారు నటించారు. ఇక నరేష్, మహేష్ మంజ్రేకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదగా జరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. “కొత్తదనంతో వచ్చిన ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. సినిమా మంచి విజయం సాధిస్తుందని” చెప్పుకొచ్చారు. అయితే ఇదే కార్యక్రమంలో రష్మీకి బాలకృష్ణ తన రాబోయే మూవీలలో ఆఫర్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఇది ఓ స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటి వరకూ హీరోయిన్ గా చేస్తున్న యాంకర్ రష్మీ, బాలకృష్ణ ఇచ్చిన స్పెషల్ సాంగ్ ఆఫర్ చేస్తే…తనపై ఐటెం గర్ల్ ముద్రపడే అవకాశం ఉందని భావిస్తుందట. అందుకే బాలకృష్ణ ఆఫర్ ని ఒప్పుకోవాలా?లేదా? అనే డైలమాలో పడిందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌