గూగుల్ క్యాంపస్ లో రాజమౌళి హంగామా

jakkanna-google-202100

హాలీడే టూర్ ఫినిష్ చేసిన డైరెక్టర్ రాజమౌళి.. వచ్చేనెల‌లో దక్షిణకొరియాలో జరిగే బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్తాడు. ఓ వైపు ‘బాహుబలి 2’ ప్రీ-ప్రొడక్షన్‌ పనిలోనూ య‌మ‌బిజీ అయ్యాడు. కొద్ది పాటి గ్యాప్ దొర‌కగానే మ‌రో స్టెప్ వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. శుక్రవారం హైద్రాబాద్‌లోని గూగుల్ క్యాంపస్‌లో మెరిసి, అక్కడ ఉద్యోగులతో కాసేపు గడిపి, వాళ్లతో ఇంట్రాక్ట్ అయ్యాడు.ఇక్క‌డి లొకేషన్ బ్యూటిఫుల్‌గా ఉందని, గూగుల్ ఆఫీసుకు రావడం తనకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేశాడు. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో ఒక‌టే చర్చ జ‌రుగుతోంది. రాజమౌళి గూగుల్ ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్టు? తర్వాత చేపట్టబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించి అక్కడికి వెళ్లాడా? (లేకా) ‘బాహుబలి – 2’ తర్వాత ప్రిన్స్‌తో చేసే మూవీకి సంబంధించి ఏమైనా ప‌ని ఉండి అక్కడ వాలిపోయాడా? (లేకా) లొకేష‌న్ వేట‌లో భాగంగా ఇక్క‌డికి చేరుకుని, ప‌నిలో ప‌నిగా ఉద్యోగుల‌తో ఇంట్రాక్ట్ అయ్యాడా? ఇలా అనేకానేక లేక లు .. ప్రశ్నలు ఇటు మూవీ లవర్స్‌లోనూ అటు నెటిజన్స్‌లోనూ రేగుతున్నాయ్‌. రేగుతున్న‌దొక రాగం ఎద‌లో అన్న పాట‌నూ గుర్తుచేస్తున్నాయ్‌. స‌మ్‌దేహాలు రేపుతున్నాయ్‌.వీట‌న్నింటికీ రేప‌టి వేళ ఆయ‌నేం స‌మాధాన‌మిస్తాడో..! ఆ.. ఉద‌యం కోసం వేచి చూడండిక‌!

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...