వామ్మో..రజని సినిమా సెట్ అన్నికోట్లా ?

rajani-878722

శంకర్ చిత్రాలు అంటే నిర్మాతలకి వణుకు పుడుతుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు డబ్బుని నీళ్ళలా ఖర్చు చేస్తున్నాడే అనే ఫిలింగ్ ని నిర్మాతలలో తీసుకువస్తాడు. అయితే ఆ మూవీ రీలజ్ తరువాత మాత్రం వారు పెట్టిన డబ్బులు అన్నీ లాభాలతో సహా వస్తుంటే సంతోష పడుతుంటారు. శంకర్ నిర్మాతలు అంటే ఇలాగే ఉంటారు అని ఇండస్ట్రీలో అంటుంటారు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వస్తున్న ‘రోబో 2.0’ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. లేడీ రోబో గా ఎమీ జాక్సన్ ప్రేక్షకులను అలరించనుందని అంటున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదులో భారీ సెట్స్ ని శంకర్ రెడీ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపోయిన తరువాత షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరగనుంది. ఇందులో రెండు అతి పెద్ద భారీ సెట్స్ ని శంకర్ రెడీ చేయనున్నాడు. ఒక్కో సెట్ వాల్యూ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. ఇక్కడే లాంగ్ షెడ్యూల్ జరగనుందని అంటున్నారు. 8 కోట్ల రూపాయల భారీ సెట్ ఎంతో రిచ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా శంకర్ ఒక్కో సెట్ కోసం 8 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటే, అది ఏ రేంజ్ లో ఉండనుందో అని అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌