ఈ హీరో ని గుర్తు పట్టారా?

56056030230

బాలీవుడ్‌లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో రణదీప్ హూడా. దర్శకుల హీరోగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఇతడికి సినిమా పట్ల కమిట్‌మెంట్ ఎక్కువ‌. సినిమా కోసం ఏదైనా చేసేసే రకం. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అలా ఒదిగిపోతున్నాడు. కానీ ఓ మూవీ కోసం కండలు కరిగించడమే కాదు.. ఎముకల పోగులా మారి అంద‌రికి షాక్ ఇచ్చాడు. పాక్ జైల్లో 23 ఏళ్లపాటు చిత్రవధ అనుభవించిన సరబ్ జీత్ సింగ్ జీవితంపై బయోపిక్ తీసేందుకు నేషనల్ అవార్డ్ విన్నర్ ఓమంగ్ కుమార్ సిద్ధమయ్యాడు. ఈ కేరక్టర్ కు తగిన నటుడిగా.. రణ్ దీప్ హుడాను భావించి అప్రోచ్ అయ్యాడు.
ఆ రోల్ కోసం 28 రోజుల్లో ఏకంగా 18 కిలోల బరువు తగ్గాడు.తక్కువ సమయంలో బరువు తగ్గటం మంచిది కాదని డాక్టర్లు చెప్పినా, పాత్రకు న్యాయం చేయడం కోసం రణదీప్ రిస్క్ తీసుకున్నాడని టాక్. ఈ విషయాన్ని డైరెక్టర్ ఒమాంగ్ ప్రకటించాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రణదీప్ లుక్ కి నెటిజన్స్ నుంచి స్పందన బాగానే వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా షాకింగ్ లుక్ లో కనిపించనుందని సమాచారం. ఇక ర‌ణ‌దీప్ లుక్‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రేంజ్‌లో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌