గూగుల్ సీఈవో సుంద‌ర్ స‌రికొత్త రికార్డు

59605050120

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. సుంద‌ర్ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఘనత పొందారు. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ చోటు దక్కించుకోనున్నారు.
భారత సంతతికి(త‌మిళ‌నాడు రాష్ర్టానికి) చెందిన సుందర్‌ పిచాయ్‌ 2015 ఆగస్టులో గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన షేర్లతో అల్ఫాబెట్‌లో ఆయన షేర్ల విలువ సుమారు 650 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4,430 కోట్లు)చేరింది. అల్ఫాబెట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్‌ పోరట్‌కు కూడా 38.3 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ లభించాయి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌