ఎన్టీఆర్ పై ప్రేమతో కేటీఆర్

05099650320

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు రాజ‌కీయాల్లో మిత్రులు చాలా తక్కువ మందే! ఎవ‌రో ఒక‌రిద్ద‌రు త‌ప్ప వేరొక‌రి గురించి తెలీనే తెలియ‌దు. ఇప్పుడు తార‌క్ ఫ్రెండ్స్ గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేంటంటే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి మంచి స్నేహితుడ‌ట‌. ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా? నిజ‌మే మ‌రి!
ఆంధ్ర ప్రదేశ్‌లో నందమూరి కుటుంబం సినిమాలకే కాకుండా రాజకీయాలకు కూడా ప్రసిద్ధి. మరోవైపు తెలంగాణాలో కల్వకుంట్ల వారి కుటుంబం రాజకీయాలకు పెట్టింది పేరు. అటు తాతయ్య నందమూరి రామారావు గారి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీయార్, ఇటు తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే అన్ని అర్హతలు ఉన్న కేటీఆర్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు మీడియాకు కూడా వీరిద్దరి స్నేహం గురించి పెద్దగా తెలియదు. కాని నిజానికి వీరిరివురు మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే తారక్ ఒకసారి కేటీఆర్ ని ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చూడాలని కోరాడ‌ట‌.
ఆ సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో బిజీగా ఉన్నాన‌ని, త‌ప్ప‌కుండా సినిమా చూస్తాన‌ని కేటీఆర్.. ఎన్టీఆర్ కు మాటిచ్చాడ‌ట‌. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘ‌న విజయం సాధించింది. ఈ సంతోషంలో ఉన్న కేటీఆర్‌.. శనివారం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ మల్టీప్లెక్స్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను వీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న తారక్ చాలా ఆనందపడ్డాడ‌ట‌. ఇచ్చిన మాట గుర్తుంచుకుని కేటీఆర్…తారక్ నటించిన సినిమా చూడడం వాళ్ళ మధ్య ఉన్న స్నేహం ఎంత గొప్పదో తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌