ఆ దేశం వెళ్లి వ‌స్తే కండోమ్ వాడాల్సిందే

74801450120

ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వైర‌స్ జికా. దోమలద్వారా వ్యాపిస్తున్న ఈ వైరస్ గురించి ప్రపంచంమొత్తం భయాందోళనలకు లోనవుతుంది. జికా వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ సైతం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ వ్యాధి తీవ్రతరం అవుతుండటంతో.. ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఇక ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఈ విష‌యంలో ఐర్లాండ్ దేశం ముందుగా అప్రమత్తమయింది. తమ దేశానికి చెందిన పర్యాటకు ఎవరైనా ఆఫ్రికా, అమెరికా దేశాలు వెళ్లొస్తే.. నెలరోజుల పాటు కండోమ్ వాడాలని.. ఆదేశాలు జరీ చేసింది.
ఇక ఎవరికైనా జ్వరం, తలనొప్పి వంటి జికా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారు ఆరునెలల పాటు కండోమ్ వాడాలని, వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు రక్తదానం చేయకూడదని ఐర్లాండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జికా వైరస్ మగవాళ్ళ వీర్యం ద్వారా వ్యాపించే అవకాశం ఉందని బ్రిటన్ చెపుతోంది. జికా వైరస్ ప్రభావిత దేశాలైన యూరప్, ఆఫ్రికా, అమెరికాకు వెళ్లొస్తే.. తప్పని సరిగా టెస్ట్ లు చేయించుకోవాలని.. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనుక ఉంటె.. వారు రక్త దానం చేయడాన్ని బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. ఈ జికా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గజగజ వనికిపోతోంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌