త్రివిక్రమ్ కి మహేష్ బాబు షాక్ !

tt7845450120120

మాటల మాంత్రికుడకి మహేష్ బాబు షాకింగ్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ప్రేమకథా చిత్రం అ..ఆ. నితిన్,సమంత కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన విషయంలో త్రివిక్రమ్ అనుకున్నది జరగలేదు. ఫిబ్రవరి 14 రిలీజ్ కావాల్సి ఉండగా, తరువాత ఇది రిలీజ్ కావటం లేదు. ఇక నితిన్ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 22 వ తేదీన సినిమా విడుదల చేయనున్నారని అంటున్నారు. అయితే ఏప్రిల్ 8న పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ సరైనోడు, అలాగే 14న సూర్య 24, 28 న మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ అవుతున్నాయి. భారీ చిత్రాలతో త్రివిక్రమ్ మూవీ పోటీ పడనుందా? అనే డౌట్ అందరిలో వస్తుంది. అయితే ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ మూవీ, ఆ తరువాత ఏప్రిల్ 22న త్రివిక్రమ్, ఏప్రిల్ 28న బ్రహ్మోత్సవం అనుకుంటే…ఇక్కడ త్రివిక్రమ్ మూవీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఎక్కవుగా కనిపిస్తుంది. ఏప్రిల్ 22 తరువాత వారం రోజులు గ్యాప్ లేకుండా మహేష్ మూవీ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా అ..ఆ మూవీకి థియోటర్స్ రెండోవారానికి కష్టంగా ఉంది. మహేష్ బాబు మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటే కానీ…త్రివిక్రమ్ మూవీ బతికే ఛాన్స్ కనిపించటం లేదు. కానీ మహేష్ బాబు తన మూవీని అనుకున్న డేట్ కే రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నాడంట.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌