ఆ రైటర్ ని పక్కన పెట్టిన జూనియర్

90590560230230

ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తన మూవీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా కథలో ఏ మాత్రం తప్పులు కనిపించినా వెంటనే వాటిని కరెక్ట్ చేసేందుకు ఎంత సమయం అయినా తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఓ రైటర్ కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన జూనియర్…ఆ రైటర్ కి రాసిన కథలో కొద్దిపాటి పొరాపాట్లు కనిపించాయంట. అందుకు కథపై ఇంకా కసరత్తులు చేయాలంటూ ఆ రైటర్ కి చెప్పుకొచ్చాడు. ఆ రేటర్ ఎవరో కాదు. ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాలకి కథలను అందించిన రైటర్ వక్కంతం వంశీ. ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ ఒక కథను రెడీ చేసి, తానే దర్శకుడిగా ఆ కథను తెరకెక్కించాలని అనుకున్నాడు. అయితే ఈ కథలో మార్పులు కోరిన జూనియర్, మార్పులను రైటర్ పూర్తి చేసినప్పటికీ…ఇంకా వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం కొరటాల శివకి ఓకే చెప్పాడు. దీని తరువాత పూరి చెప్పిన కథకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మరోసారి వక్కంతం వంశీ సినిమాకి బ్రేక్ పడింది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాగా బాగా కసరత్తులు చేసిన వక్కంతం వంశీకి, ఎన్టీఆర్ నిర్ణయం కారణంగా బాగా నిరుత్సాహ పడుతున్నాడంట. ఇక ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని వదులుకోవటమే బెటర్ అని వక్కంతం వంశీ భావిస్తున్నాడు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...