సెక్స్ వ‌ర్క‌ర్ల‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌

48050512010480

దేశంలో సెక్స్ వర్కర్ల హక్కుల విషయంలో ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ త్వరలో పలు సిఫారసులతో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్ లో సెక్స్ వర్కర్లు ఎంత మంది ఉన్నారు... వారి పరిస్థితి ఏమిటన్న విష‌యాలు ప‌రిశీలిస్తే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి. దేశంలోని మొత్తం సెక్స్ వర్కర్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారట. ఈ విషయంలో ఏపీ దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది. ఇండియాలో ఉన్న 9 ల‌క్ష‌ల మంది సెక్స్ వ‌ర్క‌ర్ల‌లో ఏపీ ఫ‌స్ట్ ప్లేసులో ఉంది.
ఏపీలో 1.56 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఢిల్లీలో వీరి సంఖ్య 61వేలు. కర్ణాటక మహారాష్ట్రలు మూడు నాలుగో స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల్లో రికార్డైన సమాచారం ప్రకారం దేశంలో సెక్స్ వర్కర్ల సంఖ్య 6.96 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 136794 మంది ఉన్నారు. కాగా ఈ సంఖ్య అనధికారికంగా 156205గా ఉండవచ్చు. కర్ణాటకలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 86386 మంది ఉండగా ఈ సంఖ్య అనధికారికంగా 96057 ఉంటుందని అంచనా. మహారాష్ట్రలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 85416 మంది ఉన్నారు. అనధికారికంగా 79586 మంది. తమిళనాడులో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 43543 మంది ఉన్నారు. ఈ సంఖ్య అనధికారికంగా 70732 ఉండవచ్చు.
పశ్చిమ బెంగాల్లోలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 31235 మంది కాగా అనధికారికంగా 57850 మంది ఉన్నారు. 19 శాతం మంది సెక్స్ వర్కర్లు రిజిస్టర్ చేసుకోలేదు. అయితే… ఇవన్నీ 2009 నాటి మ్యాపింగ్ స్టడీ ఆధారంగా వేసిన లెక్కలు. తాజా అంచనాల ప్రకారం దేశంలో 12 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. ఏదేమైనా ఏపీ సెక్స్ వ‌ర్క‌ర్ల విష‌యంలో టాప్ ప్లేసులో ఉండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే అని చెప్పాలి.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...