టాప్ హీరోని ఒప్పించిన కొత్త డైరెక్టర్

840480450120

2016లో వచ్చిన మెట్ట‌మెద‌టి చిత్రం నేను శైల‌జ. ఈ మూవీ టాలీవుఢ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి హిట్ ని అందించింది. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమ‌ల సైతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. నేనుశైలజ మూవీతో రామ్ కి హిట్ అందించిన ఈ డైరెక్టర్ మరోసారి రామ్ తో పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. అలాగే రీసెంట్ గా హీరో నితిన్ తో ఓ మూవీని చేసేందుకు రెడీ అయ్యాడు. అంతలోనే మరో స్టార్ హీరోతో పని చేసేందుకు కిషోర్ తిరుమల గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. విక్ట‌రి వెంక‌టేష్ ప్రస్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వం లో చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద‌ ఉంది. దీని తరవాత కిషోర్ తిరుమల విక్టరీ వెంకటేష్ తో మూవీని చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ చెప్పటం విశేషం. ఇదే విషయం కిషోర్ తిరుమ‌ల చెబుతూ ”నేను శైల‌జ లాంటి హిట్ చిత్రం త‌రువాత విక్ట‌రి వెంక‌టేష్ తో నా త‌దుప‌రి చిత్రం వుంటుంది. వెంక‌టేష్ కి క‌థ చెప్ప‌టం జ‌రిగింది. వెంక‌టేష్ కి క‌థ న‌చ్చ‌టంతో ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నా త‌దుప‌రి చిత్రం వెంక‌టేష్ తో చేస్తున్నందుకు ఆనందంగా వుంది.” అన్నారు ఇక వెంకటేష్ తరువాత నితిన్ తో కిషోర్ తిరుమల మూవీ ఉండబోతుందని అంటున్నారు. మొత్తంగా తక్కువ టైంలోనే కిషోర్ తిరుమల టాప్ హీరోల కాల్షీట్స్ ని సాధింకోవటం గ్రేట్ అని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌