కాంగ్రెస్‌లో `చిరు` శ‌కం ముగిసిందా..!

chiru-8282

మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందా? ఇక కాంగ్రెస్‌లో `చిరు` శ‌కం ముగిసిన‌ట్టేనా? మొద‌ట్లో అంద‌ల‌మెక్కించుకుని.. త‌రువాత ప‌ట్టించుకోవ‌ట్లేదా? ఇక రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్‌లో చిరు ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న‌కు ఇప్పుడున్న స్థానం ద‌క్క‌క్క‌పోవ‌చ్చా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా అనంత‌పురంలో జ‌రిగిన స‌భ‌లో చిరు క‌నిపించ‌క‌పోవ‌డం ఈ స‌మాధానానికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సినీనటుడు చిరంజీవిని ఆ పార్టీ పట్టించుకోవడం లేద‌ని విశ్లేష‌కులు అబిప్రాయ‌ప‌డుతున్నారు. చిరంజీవి చరిష్మాతో మరోసారి ఏపీలో కాంగ్రెస్ బలపడాలని భావిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ తీరును బట్టి చూస్తే ఇది తెలుస్తుంద‌ని చెబుతున్నారు. మ‌న్మోహన్, రాహుల్ వంటి కాంగ్రెస్ దిగ్గజాలు హాజరైన ఈ సభకు రాష్ట్రంలోని కాంగ్రెస్ కు చెందిన ప్రధానమైన నేతలంతా హాజరైనా… చిరంజీవి మాత్రం ఈ సభకు హాజరుకాలేదు. అయితే చిరంజీవికి ఈ సభకు ఆహ్వానం వెళ్లలేదా లేక ఆయనే కావాలని ఈ సమావేశానికి డుమ్మా కొట్టారా? అనే దానిపై కాంగ్రెస్ నేతలు స్పష్టం ఇవ్వడం లేదు.
మరికొందరు మాత్రం చిరంజీవి ప్రభావం పెద్దగా లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఆయనను పక్కన పెడుతోందని… అందుకే ఈ సభకు ఆయనను ఆహ్వానించలేదనే ప్రచారం సాగుతోంది. ఇక ఒకసారి రాజ్యసభ టర్మ్ పూర్తయిన తరువాత చిరంజీవికి పార్టీలో సముచిత స్థానం కూడా దక్కకపోవచ్చనే వాదనలు కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి అధిష్టానం పెద్దల హాజరైన సభకు చిరంజీవి దూరం కావడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మ‌రి ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే చిరు శ‌కం కాంగ్రెస్‌లో ముగిసిన‌ట్టేనని అంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...