సంకెళ్లు వేసుకుని స‌ర‌సాలాడి బుక్ అయ్యాడు

804502010

అనుకున్న‌దొక్క‌టి..అయ్యిందొక్క‌టి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సామెత ఈ జంట‌గా అక్ష‌రాలా వ‌ర్తిస్తుంది. ఓ అందమైన సాయంత్రం సరదా, విచిత్రంగా ఎంజాయ్ చేయాలని అనుకుందో జంట. అలానే ఎంజాయ్ చేసి అది కాస్తా బెడిసికొట్టడంతో జైల్లో కూర్చున్నారు. లిటిల్‌రాక్‌కు చెందిన డస్టన్ టైలర్(21) తన భార్యతో కలిసి ఆ రాత్రి విచిత్రంగా ‘ఎంజాయ్‘ చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఇద్దరూ చేతికి బేడీలు వేసుకుని సరసాల్లో మునిగిపోయారు. సెక్స్‌లో మ‌స్తుగా ఎంజాయ్ చేసిన వారు త‌ర్వాత ఆ సంతోషంలో వారు చేతికి వేసుకున్న బేడీల తాళాన్ని పోగొట్టుకున్నారు.
చివ‌ర‌కు చేసేదేమి లేక‌ చివరికి టైలర్ పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం వివరించి ఇంటి అడ్రస్ చెప్పాడు. దీంతో పెట్రోలింగ్ నిర్వహించే ఓ పోలీస్ వచ్చి కష్టపడి వారి చేతికున్న బేడీలు తొలగించాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. బేడీలు తొలగించి వెళ్లిపోయిన పోలీసు తన రోజువారి కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్‌లో పోలీస్ డాటా బేస్ వెతుకుతుంటే టైలర్ పేరు కనిపించింది. దీంతో ఉలిక్కిపడిన ఆయన అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. టైలర్‌ నేరచరితుడని, అతనిపై వారంట్ కూడా ఉందని తెలుసుకున్నాడు. దీంతో మళ్లీ వెంటనే టైలర్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. సరదా కోసం వేసుకున్న బేడీలు కాస్త నిజంగానే చేతికి బిగుసుకుపోవడంతో టైల‌ర్ తలపట్టుకున్నాడు. ఈ ఘటనపై పోలీస్ అధికారి ఒకరు సరదాగా స్పందిస్తూ వారు బేడీల తాళం మరొకటి ఉంచుకోవాల్సిందని చమత్కరించాడు.
న‌యా సెక్స్‌: సంకెళ్ల‌తో స‌ర‌సాలు

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌