సుకుమార్ ని రెచ్చగొడుతున్నాడు

08014501201

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ని మరోసారి రెచ్ఛగొడుతున్నాడని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీతిసింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి భారీ విజయాన్ని చూసింది. ఈ మూవీ జూనియర్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ ని సాధించిన మూవీగా నిలిచింది. అలాగే ఎప్పటి నుండో తీరని కలగా ఉన్న 50 కోట్ల క్లబ్ లోనూ నాన్నకు ప్రేమతో మూవీ ఎంట్రి అయింది. ఇన్ని విధాలుగా నాన్నకు ప్రేమతో మూవీ జూనియర్ కి మంచి పేరుని తీసుకువచ్చింది. ఇంతటి సక్సెస్ ని ఇచ్చిన సుకుమార్ తో, జూనియర్ మరో మూవీని చేయటానికి రెడీ అంటున్నారు. సుకుమార్ ని మరో కథని రెడీ చేసుకోవాల్సిందిగా చెప్పుకొస్తున్నాడంట. అయితే సుకుమార్ మాత్రం ఇందుకు సిద్ధంగా లేనని చెబుతున్నప్పటకీ, జూనియర్ మాత్రం సుకుమార్ ని రెచ్ఛగొడుతున్నాడని అంటున్నారు. ఇక తాజాగా నాన్నకు ప్రేమతో 25 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా ప్రదర్శిస్తున్న అన్నీ థియేటర్లలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా హాజరు అవుతాడని తెలుస్తుంది. అయితే జూనియర్ చేస్తున్న ఒత్తిడికి, సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అనేది చూడాలని అని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌