ఇండస్ట్రీలో సిద్ధార్ధ్ చేతులెత్తేసినట్టేనా?

890450120120

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న స్టార్ యాక్టర్ సిద్ధార్ధ్. సిద్ధార్ధ్ ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందుకు కారణం తను నటిస్తున్న మూవీలు బాక్సాపీస్ లాభాలు తీసురాలేకపోవటమే అని అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో సిద్ధార్ధ్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస చిత్రాలను తీయటానికి రెడీ అవుతున్నాడు. అందుకు ఓ కార్యచరణ కూడ సిద్ధం చేసుకున్నాడు. గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి విభిన్న చిత్రాలలో నటిస్తున్న సిద్ధార్ధ్ ‘జిల్ జంగ్ జక్’ పేరుతో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. ఈమూవీపై సిద్ధార్ధ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే హీరోగా సిద్ధార్ధ్ కి రోజు రోజుకి ఆధరణ తగ్గుతుంది. కారణం.. తను వరుస చిత్రాలలో నటించలేక పోవటమే. అలాగే తన మూవీలపై పెట్టుబడులు పెట్టే నిర్మాతలు దొరక్కపోవటమే. అందుకే తను ఇక నుండి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎటాక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భవిష్యత్‌లో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇందులో కొత్త రచయితలకు రెడ్ కార్పెట్ వేశాడు. తమిళంలో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే దర్శకుల కోసం తను ఈ బ్యానర్ ని పెట్టినట్టు చెప్పుకొచ్చారు. దీంతో హీరోగా చేతులెత్తేసిన సిద్ధార్ధ్, ఇక నుండి నిర్మాణ రంగంవైపూ అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీలో అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌