మోహ‌న్‌బాబు మెచ్చిన మ‌హిళా స‌ర్పంచ్‌

0450450120

తెలంగాణ ఆడ‌ప‌డుచు, ఆంధ్రా కోడ‌లు రామిరెడ్డిప‌ల్లి స‌ర్పంచ్ ప‌ద్మ‌జ‌పై ప్ర‌ముఖ సినీ న‌టుడు, డైలాగ్‌కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ‌కు చెందిన ప‌ద్మ‌జ చిత్తూరు జిల్లాకు కోడ‌లుగా వ‌చ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరిలోని రామిరెడ్డిపల్లికి ఆమె స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. ఆమె స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యాక రామిరెడ్డిప‌ల్లి అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంది.
అయితే ఇటీవ‌ల‌ తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు ప్రదర్శనను రామిరెడ్డిపల్లిలో నిర్వహించారు. ఈ సంబరానికి హీరో మోహన్ బాబు ఆయన కుమారుడు యువ హీరో మంచు మనోజ్ స్థానిక వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి హాజరై గ్రామస్తులతో కలసి జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు. అనంత‌రం మోహ‌న్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్‌కు కోడలుగా వచ్చి సర్పంచ్ గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ప‌ద్మ‌జ‌ను అభినందించారు. ఆమె ఆధ్వ‌ర్యంలో గ్రామం ఆద‌ర్శ‌గ్రామంగా దూసుకెళ్లాల‌ని ఆకాంక్షించారు. ఇక జల్లికట్టు గురించి మాట్లాడుతూ ఆవులను జంతువులను హింసించరాదనేది తన సిద్ధాంతమని చెప్పారు. అయితే జంతువులను హింసించకుండా ఈ తరతరాల సంప్రయదాయాన్ని పాటించడంలో తప్పేమీ లేదన్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌