ఏపీలో ఘ‌నంగా కేసీఆర్ బ‌ర్త్‌డే

84501201010

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆంధ్రాలో అభిమానులు పెరుగుతున్నారు. కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావ‌రిలో కేసీఆర్‌కు ఫ్లెక్సీలు క‌ట్టి త‌మ అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్ ఈ రోజు అదే తూర్పుగోదావ‌రిలో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కేంద్రమైన అమలాపురంలో బుధవారం కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ-సీమాంధ్రుల ఐక్యవేదిక కన్వీనర్‌ సంగినీడి సీతారాం ఆధ్వర్యాన లూయీ అంధుల పాఠశాలలో ఈ వేడుకల్లో భాగంగా అంధ విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల మన్నన పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో కేసీఆర్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి ప్రసాద్‌, అభిమానులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంకు చెందిన ఓ అభిమాని కేసీఆర్ దంప‌తుల ఫొటోల‌తో నేసిన శాలువా బ‌హూక‌రించి ఆయ‌న‌పై ఉన్న అభిమానం చాటుకున్న సంగ‌తి తెలిసిందే.

Comments

Popular posts from this blog

Underground DLC: Procedurally generated levels come to The Division

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Former US Secret Service agent may have stolen bitcoins