శ‌ర్వానంద్ హీరోగా టీడీపీ ఎంపీ సినిమా

48045451021021

విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారారు ఎంపీ కేశినేని నాని. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హామ‌హాల‌తో పోటీ ప‌డి విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్టు సాధించి ఎంపీగా గెలిచిన నాని తాజాగా సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ట్రావెల్స్ రంగంలో ఉన్న నాని తాజాగా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంపీ కేశినేని నాని నిర్మాత‌గా యంగ్ హీరో శ‌ర్వానంద్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈయ‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ లో శ‌ర్వా సినిమా మొద‌లు కానుంద‌ని స‌మాచారం. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు శ‌ర్వానంద్.
ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల‌తో హ్యాట్రిక్ పూర్తి చేసాడు శ‌ర్వానంద్. ఈ హిట్స్ త‌ర్వాత శ‌ర్వాతో సినిమా కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేశినేని-శ‌ర్వానంద్ ప్రాజెక్ట్ ఓకే అయింద‌ని స‌మాచారం. సందీప్ కిష‌న్ తో రారా కృష్ణ‌య్య సినిమా తెర‌కెక్కించిన మ‌హేష్‌ బాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. తొలి సినిమా ఫ్లాపైనా.. మ‌హేష్‌ పై న‌మ్మ‌కంతో ఛాన్స్ ఇచ్చాడు శ‌ర్వానంద్. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ట్రావెల్స్‌, రాజ‌కీయాల్లో రాణిస్తున్న ఎంపీ కేశినేని నాని సినిమా రంగంలో ఎలా రాణిస్తాడో చూడాలి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌