విజయ్ కుట్ర బయటపడింది, కోపంలో సూర్య

890405125120

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది చాలా కామన్. అయితే ఈ పోటీ అనేది చిన్న హీరోలు, పెద్ద హీరోల మధ్య ఉంటుంది. ఇక పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావాల్సి వస్తే మాత్రం, దాదాపు వీరు సర్ధుబాట్లు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొంత కాలంగా ఈ పద్దతిని ఏ హీరో ఫాలో అవ్వటం లేదు. అందుకే రీసెంట్ గా కోలీవుడ్ లోనూ ఇద్దరు పెద్ద హీరోల మధ్య బాహాటంగానే పోటీ జరుగుతంది. ఈ ఏప్రియల్ 14న కోలీవుడ్ లో తమిళ సంవత్సరాది ప్రారంభం అవుతుంది. సూర్య, విజయ్ బాక్సాపీస్ వద్ద బరిలోకి దిగారు. విజయ్ నటిస్తున్న చిత్రం తేరి, సూర్య నటిస్తున్న 24 మూవీలు ఏప్రియల్ 14న రిలీజ్ అవుతున్నాయి. అయితే సంక్రాంతికే 24 సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా షూటింగ్ సమయానికి పూర్తి కాలేదు. అలాగే ఆ సమయంలో థియోటర్స్ సైతం సూర్యకి అనుకూలంగా లేవు. అందుకు కారణంగా విజయ్ అని అంటున్నారు. సూర్య మూవీకి విజయ్ కావాలనే థియోటర్స్ లేకుండా చేస్తున్నాడని అంటున్నారు. విజయ్ కుట్రని తెలుసుకున్న సూర్య కోపంగా ఉన్నాడంట. ఎలాగైనా ఏప్రియల్ 14న విజయ్ తో తలపడేందుకు సూర్య తగ్గడం లేదు. సూర్య భారీ థియోటర్స్ ని దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలోనూ సూర్య నటించిన ‘సెవెన్త్ సెన్స్‌’, విజయ్ నటించిన వేలాయుధం’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 26న రిలీజ్ అయ్యాయి. అయితే ఆ పోటీలో విజయ్ పైచేయి సాధించాడు. ఇప్పుడు మాత్రం సూర్య కచ్ఛితంగా రివేంజ్ తీర్చుకునేందుకు రెడీగా ఉన్నాడని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌