టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ వీళ్ళే

80780450142010

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరో జల్లెడ పట్టేశారు. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మొదటి 6 మంది హీరోయిన్స్ లిస్ట్ ని బయటకు తీశారు. ఇక ఆ మ్యాగజైన్ చెప్పిన జాబితాలో కళ్ళు చెధిరే విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూస్తే, అనుష్క, సమంత, శ్రుతిహాసన్, కాజల్, తమన్న, నిత్యామీనన్ లకి చోటు దక్కింది. అనుష్క ప్రస్తుతం తీసుకునే రెమ్యునరేషణ్ 1.20 కోట్ల రూపాయలు. అయితే మూవీ బడ్జెట్ భారీగా ఉంటే మాత్రం 1.50 వరకూ ఛార్జ్ చేస్తుంది. ఇక తక్కువ రెమ్యునరేషన్ గా 80 లక్షలతో సరిపెట్టుకుంటుంది. సమంత, శ్రుతిహాసన్, తమన్న లు సైతం 1.30 లక్షల నుండి 1.70 లక్షల వరకూ ఛార్జ్ చేస్తారు. మినిమం రెమ్యునరేషన్ గా సమంత 90 లక్షలను తీసుకోగా, శ్రుతిహాసన్ 80 లక్షలను తీసుకుంటుంది. ఇక కాజల్ , తమన్న లు మాత్రం కోటి రూపాయలకు ఫిక్స్ అయిపోయారు. మినిమం రెమ్యునరేషన్ క్రింద 70 లక్షలకే డీల్ ని క్లోజ్ ని చేస్తారు. ఇదిలా ఉంటే ఇంకా గ్లామర్ హీరోయిన్స్ ఉన్నప్సటికీ, నిత్యామీనన్ కి ఇందులో చోటు దక్కింది. నిత్యామీనన్ చేసేది తక్కువ మూవీలు అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా రెమ్యునరేషన్ ని ముక్కుపిండి వసూల్ చేస్తుందట. తాజాగా కోలీవుడ్ లోని ఓ చిత్రానికి కోటి రూపాయలు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఇక టాలీవుడ్ లోనూ ఓ అప్ కమింగ్ మూవీకి అదే కోటి రూపాయలను రెమ్యునరేషన్ క్రింద తీసుకుంటుంది. మొత్తంగా ఈ హీరోయిన్స్ సౌత్ ప్రొడ్యూసర్స్ వద్ద నుండి భారీగా రెమ్యునరేషన్స్ ని తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...