గోపిచంద్ సరసన సమంత కన్ఫర్మ్ ?

048024501202

స్టార్ హీరో గోపిచంద్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ని సక్సెస్ ఫుల్ గా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గోపిచంద్ కి హోమ్ బ్యానర్ గా చెప్పుకునే భవ్య క్రియేషన్స్ వారు, తాజాగా ఓ ఆసక్తికరమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ‘ముత్యాల ముగ్గు’ అనే టైటిల్ ని వీరు పెట్టి, ఈ మూవీకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ పై చర్చలు జరుగుతున్నారు. లెజండ్రీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో 1975 లో వచ్చిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ మూవీ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఇంతటి పాపులర్ టైటిల్ ని భవ్య క్రియేషన్స్ వారు ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేయించటంతో ఈ మూవీలో కచ్ఛితంగా గోపిచంద్ హీరోగా నటించనున్నాడని అంటన్నారు. అయితే కొందరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి చూస్తుంటే, ఇందులో హీరోగా గోపిచంద్, హీరోయిన్ గా సమంత నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కంప్లీట్ ఫ్లామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది అని అంటున్నారు. ఇండస్ట్రీలోని భారీ తారాగణంతో ఈ మూవీని “భవ్య క్రియేషన్స్” వారు తెరకెక్కించనున్నారు. ఇక మూవీని 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి భవ్య క్రియేషన్స్ వారు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే భవ్యక్రియేషన్స్ వారు సమంతని సంప్రదించారనే న్యూస్ తెలియటంతో…సమంత, గోపించంద్ కాంబినేషన్ పై వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌