మోదీ, ఓవైసీ రహస్య భేటీ నిజమేనా ?

modi-owaisi-2722



బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ… ప్రస్తుతం ఉన్న అధికారాన్ని మరోసారి దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న నితీష్ ఆధ్వర్యంలోని కూటమి మధ్య ఆరోపణలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా నితీష్ లాలూ కూటమిని ఓడించేందుకు ఓవైసీ ఆధ్వర్యంలోని మజ్లిస్ పార్టీ పోటీకి దిగిందని జేడీయూ నేత ఒకరు ఆరోపించారు. ఇందుకోసం మోదీ, అసదుద్దీన్ మధ్య భేటీ కూడా జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో అటు బీజేపీ, ఇటు ఎంఐఎం నేతలు ఆ ఆరోపణలు ఖండించారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీపై మొదటి నుంచి పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలో మాదిరిగానే బీహార్ లోనూ బీజేపీ విజయానికి మజ్లిస్ పరోక్షంగా సాయం చేసే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓట్లు లాలూ, నితీష్ కూటమికి పడకుండా అడ్డుకుంటే… బీజేపీ గెలుపు మరింత సులువు అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో బీజేపీకి మంచి మెజార్టీ ఖాయమని పలు సర్వేలు చెబుతుండటంతో… మజ్లిస్ పార్టీ పోటీతో నితీష్, లాలూకు నష్టం కలగబోతోందని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు.

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...