2500 ఏళ్ళ మహిళపై రేప్ !

057485250210

అమెరికాలో ఓ వ్య‌క్తి 2,500 సంవత్సరాల వ‌య‌స్సు గ‌ల ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా ? అంత వ‌య‌స్సు ఉన్న‌మ‌హిళ ఇంకా బ‌తికి ఉంటుందా .. ! అనే క‌దా మీ డౌటు. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని స్మితసోనియన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలో 2500 ఏళ్ల నాటి ఈజిప్షియన్‌ మమ్మీపై 44 ఏళ్ల జేమ్స్‌ మన్రో అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. తొమ్మిదేళ్ల నుంచి నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మొదట్లో అతడు చాలా మంచిగా, మర్యాదగా ఉండేవాడు. రెండేళ్ల కిందట తన భార్యతో విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుంచి అతడి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. అందరితో కోపంగా, ఆవేశంగా మాట్లాడడం ప్రారంభించాడు.
ఈ నేప‌థ్యంలో ఆ మ్యూజియంలోని మమ్మీల్లో ఒకటి బాగా దెబ్బతిని ఉండడాన్ని మన్రో బాస్‌ గమనించాడు. అక్కడ సీక్రెట్ వీడియో కెమేరాలు ఏర్పాటు చేయించాడు. కొన్నాళ్ల తర్వాత ఈ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూసి ఆ బాస్‌కు మతిపోయింద‌ట‌.. గత సోమవారం రాత్రి 2,500 ఏళ్ల నాటి ఆ ఈజిప్షియన్‌ మమ్మీ ఉన్న గాజు పెట్టె తలుపులు తీసి మన్రో ఆ మమ్మీపై పడుకుని దానిపై ‘అత్యాచారం’ చేసిన విషయం వీడియోలో రికార్డయింది. దీంతో ఆ వాచ్‌మన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిపై అసభ్య ప్రవర్తన, ఆస్తుల విధ్వంసం కేసులు నమోదు చేశారు. మన్రో మానసికంగా సరైన స్థితిలో లేడని, అతడికి కౌన్సెలింగ్‌ అవసరమని పోలీసులు అంటున్నారు.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌