రాజా గారి బాహుబలి2 గోవింద!

74514010120

రాజమౌళి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ బాహుబలి2 గోవింద అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి ఏదో జరగకూడనినష్టం జరిగిందని కాదు, వీరి ఉద్ధేశం. రాజమౌళి, బాహుబలి2 విషయంలో ఏదైతే అనుకున్నాడో…ఇప్పుడు అది జరగలేదంటూ వీరు లెక్కలు చెబుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం బాహుబలి మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాకు మార్కెట్ పరంగా, సాంకేతిక స్థాయి పరంగా మరోసారి ఓ రీజనల్ సినిమా సత్తా ఏంటో చూపించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకు కొనసాగింపుగా వస్తున్న రెండో భాగంపై అంతటా ఆసక్తి నెలకొంది. మొదటి భాగం కంటే, రెండో భాగమే అసలు సినిమా అని చిత్ర యూనిట్ సైతం ఆంటుంది. అందుకే రెండో భాగం పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూవస్తున్నాయి. ఇదిలా ఉంటే, బాహుబలి ది కంక్లూజన్ పేరుతో రానున్న రెండో భాగం 2016లో రిలీజ్ ఉంటుందంటూ రాజమౌళి ఎప్పటి నుండో చెప్పుకొస్తున్నాడు. అయితే తాజా వివరాల ప్రకారం, బాహుబలి2 2016లో రావటం కష్టమే అని అంటున్నారు. బాహుబలి2 స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసుకున్నప్పటికీ, ఇంకా టెక్నికల్ గా ఈ మూవీకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. అందుకే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళే సమయానికి డిసెంబర్, జనవరి నెలలో ఉండొచ్చని అంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ని ముగించుకొని 2016లో రిలీజ్ అంటే దాదాపు కష్టతరమే అని అంటున్నారు. దీంతో ఈ మూవీ. 2017లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుగా కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌